Ggggg

ఉద్దేశ్యం:
ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక HIV కి వ్యతిరేకంగా పోరాడడం, ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రజలకు మద్దతు ఇవ్వడం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (World AIDS Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


ఎప్పటీ నుంచి?:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది.

అందువల్ల 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.


థీమ్స్ (Themes):
2020: Global solidarity, resilient HIV services
2019: Communities make the difference
2018: Know your status (మీ స్థితిని తెలుసుకోండి)
2017: My Health, My Right (నా ఆరోగ్యం, నా హక్కు)


గణాంకాలు:

1984 నుండి 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా ప్రజలు HIV/AIDSతో మరణించారు. ఇది చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారిలో ఒకటిగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి 38 మిలియన్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారు.

2018 లో ప్రపంచంలో సుమారు 7.7 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించారు.

2019 లో 690000 మంది HIV సంబంధిత కారణాలతో మరణించారు మరియు 1.7 మిలియన్ల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కల ప్రకారం 2019 నాటికి దేశంలో ఎయిడ్స్ రోగుల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచాయి.

2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా అందులో 1.82 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో, 78వేల మంది తెలంగాణలో ఉన్నారు.

Ayyo News

Previous Post Next Post